close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

పంచసూత్రాలను పకడ్బందీగా అమలు చేయాలి

లక్ష్మీపూర్‌, పందిల్ల (కాల్వశ్రీరాంపూర్‌), న్యూస్‌టుడే: పంచసూత్రాలను గ్రామాల్లో పకడ్బంధీగా అమలు చేయాలని జిల్లా పాలనాధికారిణి శ్రీదేవసేన పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం లక్ష్మీపూర్‌, పందిల్లలో నిర్వహించిన స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీపూర్‌లో పాఠశాలను సందర్శించగా పరిశుభ్రంగా ఉన్నందున విద్యార్థులను, సిబ్బందిని, గ్రామంలో పంచసూత్రాల అమలుతీరును చూసి గ్రామస్థులను అభినందించారు. పందిల్ల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి మొక్కలు నాటారు. విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని సాధన దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మహిళలను గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తిచేయడంతో మురుగు కాలువలను నిర్మూలించామన్నారు. తడి పొడి చెత్త, ప్లాస్టిక్‌ వేరువేరుగా సేకరిస్తున్నామని, కాంపోస్ట్‌ పిట్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెత్త నిర్వహణ సమర్థవంతంగా చేయాలని, ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణ కొనసాగించాలని, రోడ్లపై చెత్త వేయరాదని, వేసే వారికి జరిమానా విధించాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులకు పంచసూత్రాలపై అవగాహన ఉందన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు మంచి సహకారం అందించారని, ఇదే స్ఫూర్తితో కొనసాగించాలన్నారు. పారిశుద్ధ్యం పెంపొందించేందుకు 20 ఇళ్లకు స్వశక్తి సంఘం మహిళను నియమించి వారి ద్వారా పర్యవేక్షణ చేస్తామన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమాజంలో పిల్లలకు మహిళను గౌరవించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ప్రసాద్‌, వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, పౌరసంబంధాల అధికారి వి.శ్రీధర్‌, ఎంపీడీవో జి.కిషన్‌, ఉపతహసీల్దార్‌ సుమన్‌, ఏపీఎం పద్మ, ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచులు బండ రవీందర్‌రెడ్డి, దాసరి లావణ్యరమేష్‌, ఎంపీటీసీ సభ్యుడు రావి సదానందం, బోయిని చందర్‌, ఇల్లందుల రమేష్‌ పాల్గొన్నారు.

ఘనంగా శేషప్ప సాహితీ ఉత్సవం
ధర్మపురి: ధర్మపురి బ్రాహ్మణసంఘం భవనంలో శుక్రవారం రాత్రి శేషప్ప సాహితీ ఉత్సవం ముగిసింది. ఉదయం పద్య పఠన పోటీలు నిర్వహించారు. మధ్యాహ్న కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. రాత్రి ముగింపు సమావేశానికి కలెక్టర్‌ డా.శరత్‌ హాజరై విజేతలకు వెండి పతకాలు, బహుమతులు అందజేశారు. ఉదయం కార్యక్రమంలో ధర్మపురి, బుగ్గారం మండలాల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నరసింహశతక పద్య పటన పోటీలు నిర్వహించగా, మధ్యాహ్నం ప్రముఖ సాహితీవేత్త డా.సంగనభట్ల నర్సయ్య శేషప్ప జీవిత విశేషాలు, రచనల మీద విస్తృతంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో మరిన్ని సాహిత్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పలువురు కవులు, కళాకారులు, తెలుగు పండితులు హాజరయ్యారు. నరసింహశతక పద్య పోటీల్లో శ్రీనిధి(మొదటిబహుమతి), సహస్ర(రెండోబహుమతి), స్నేహ(తృతీయబహుమతి) విజయం సాధించారు. పలువురు సాహితీ మిత్ర మండి సభ్యులు, కవులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.