close

బుధవారం, జనవరి 29, 2020

ప్రధానాంశాలు

మేడారం

వసతిగృహ విద్యార్థులకు సంక్షేమ ఫలాలు

విద్యార్థులు సాగు చేస్తున్న కంది పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కామారెడ్డి కలెక్టరేట్‌,న్యూస్‌టుడే : జిల్లాలోని వసతిగృహ, గురుకుల విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వసతిగృహాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీసీ వసతిగృహాల్లో చదువుకుంటున్న 2291 మందిలో 3 నుంచి 7వ తరగతి వారికి నెలకు రూ.950, 8- 10 విద్యార్థులకు నెలకు రూ.1100 చొప్పున డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ చదివే వారికి నెలకు రూ.1500 అందిస్తున్నామన్నారు. ఏటా రాత పుస్తకాలు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, నాలుగు జతల దుస్తులు ఇస్తున్నామన్నారు. పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాల కింద రూ.14.8 కోట్లు, ప్రీ మెట్రిక్‌ కింద రూ.8 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకూ ఇవే డైట్‌ఛార్జీలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో ప్రీమెట్రిక్‌ కింద రూ.3.12 కోట్లు, పోస్టు మెట్రిక్‌ కింద రూ.1.30 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్టీ వసతిగృహాల్లో పోస్టు మెట్రిక్‌కు రూ.36 కోట్లు విడుదల చేశామన్నారు. మైనారిటీ వసతిగృహాల్లోని 2122 మంది విద్యార్థులకు రూ.39 లక్షలు విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి, షబ్నా, శ్రీనివాస్‌బాబు, అంబాజీ, సత్యనారాయణ, తిరుపతి, విజయలక్ష్మి, అలివేలు పాల్గొన్నారు.

2,67,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

మాల్తుమ్మెద(నాగిరెడ్డిపేట), : జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,091 మంది రైతుల నుంచి 2,67,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రం, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఉద్యాన క్షేత్రంలో సాగు చేస్తున్న బంతిపూల తోటను పరిశీలించారు. పంట ప్రత్యేకతలు, దిగుబడుల వివరాలను డీడీ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. జామ తోటలో కాసిన జామ కాయలను అధికారులతో కలిసి తిన్నారు. అనంతరం రాశివనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పక్కనే విద్యార్థులు సాగు చేస్తున్న కంది పంటను చూశారు. తాను ఆర్థికంగా సహకరిస్తానని నూతన ఒరవడితో పంటలను సాగు చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.332.21 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. కామారెడ్డిని సురక్షిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పోచారం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు ఉన్నందున ఆయకట్టు కింద రెండు జోన్‌లకు సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతామన్నారు. ఆయన వెంట ఎంపీపీ రాజ్‌దాస్‌, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సయ్యద్‌, ఎంపీడీవో శ్యామల, కళాశాల ప్రిన్సిపల్‌ కనకదుర్గ, ఎచ్‌వో రామకృష్ణ, ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.