close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

సమస్యలపై సమష్టి పోరాటం

తెజస, ఇంటి పార్టీల ఉమ్మడి కార్యాచరణ

బోరబండ, న్యూస్‌టుడే: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందడం లేదని.. దీనిపై ఇకపై కలిసి పోరాటం సాగిస్తామని తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి, ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలకు పాలన, నిర్ణయాధికారం ద్వారా అసమానతలు లేని తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌ వెల్లడించారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఇరు పార్టీల నాయకులతో కలసి శుక్రవారం వారు మాట్లాడారు. ఆచార్య పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, ఆచార్య జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శ్రీశైల్‌రెడ్డి, కరణం బాలయ్య, బుర్రా శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి రామన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

నిర్బంధ ‘శిక్ష’ణ.. ప్రాణాలకేదీ రక్షణ?

సోమవారం వచ్చిందంటే రెండు లేదా మూడు పరీక్షలు రాయాల్సిందే..! ఇక దానికి ముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీఅవర్‌ పేరిట రుద్దుడు.. అలా అని వారంలో మిగిలిన రోజులు స్వేచ్ఛగా ఉంటుందా.. అంటే అసలే ఉండదు. రెగ్యులర్‌ సబ్జెక్టులు చదవాలి.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.. నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పంజరంలా భావిస్తున్న కళాశాలల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా.. అని భావిస్తున్నారు. ఏదో రకంగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  చేరితే చదువు తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా కనీసం బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండటం లేదు. కళాశాలలో చేరినప్పట్నుంచి ఇంటర్‌ విద్యార్థులపై చదవుల భారం వేస్తుండటంతో.. వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.