close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లాలో మరో 80 పాజిటివ్‌ కేసులు

ధర్మపురిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లాలో గురువారం మరో 80 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా కేంద్రంలో 25 మందికి పాజిటివ్‌గా, ధర్మపురిలో 18, కోరుట్లలో 13, మెట్‌పల్లిలో 11 మందికి రాగా కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నలుగురికి, మల్యాలలో ముగ్గురికి, జగ్గాసాగర్‌లో ఇద్దరికి సారంగాపూర్‌, అంబారిపేట (పాత) గొల్లపల్లి, అయిలాపూర్‌, పెగడపల్లి, మల్లాపూర్‌ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది. 80 మందిలో 10-15 ఏళ్ల మధ్య వయస్కులు 15 మంది ఉన్నారు.

ధర్మపురి, న్యూస్‌టుడే: ధర్మపురి పట్టణంలో గురువారం సాయంత్రం మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 5న జరిగిన వివాహ వేడుకలే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. వివాహ వేడుకల సందర్భంగా కనీస చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని భావిస్తున్నారు. బుధవారం మొత్తం 18 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిలో వివాహానికి హాజరైన వారు 16 మంది ఉన్నారు తాజాగా గురువారం మొత్తం 35 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా, వారిలో 18 మందికి పాజిటివ్‌ రావడం, వీరంతా 5న జరిగిన వివాహానికి హాజరైన వారే కావడం గమనార్హం. ఈ వివాహానికి మొత్తం 150 మంది హాజరైనట్లు, కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని అధికారులు భావిస్తున్నారు. గురువారం పరీక్షలతో ఈ విషయం పూర్తిగా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. హాజరైన వారి వివరాల జాబితా సిద్ధం చేసి అందరికీ పరీక్షలు చేస్తామని చెప్పారు. పురపాలక సంఘం కమిషనర్‌ టి.రాజలింగు ఉదయం పలు వీధుల్లో సిబ్బందిచే రసాయన ద్రావణాన్ని స్ప్రే చేయించారు.

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన కరోనా ర్యాపిడ్‌ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి నరేంద్ర తెలిపారు. ఏడుగురికి పరీక్షలు చేయగా, ఐదుగురికి నెగెటివ్‌, మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు.

పెగడపల్లి: పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన రాపిడ్‌ టెస్టు ఫలితాల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి సుధాకర్‌ తెలిపారు. మొత్తం 11 మందికి పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు.

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల పట్టణంలో 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు వైద్యులు తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో 26 మందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన 13 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయిందని ప్రభుత్వ వైద్యాదికారి నవీన్‌ తెలిపారు.

ఒక పూటే దుకాణాలు

ధర్మపురిలో కరోనా వైరస్‌ ప్రబలుతున్నందున నేటి నుంచి వచ్చే నెల 12 వరకు మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు నిర్వహిస్తామని వర్తకసంఘం, కిరాణా, వస్త్ర దుకాణాల యజమానుల సంఘం వారు తెలిపారు. గడువు సమయం తర్వాత దుకాణం తెరిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రకటించారు.


16 నుంచి మెట్‌పల్లిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

శానిటైజ్‌ చేస్తున్న పుర సిబ్బంది

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా వ్యాధిని అరికట్టేందుకు ఈనెల 16 నుంచి 31 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించేందుకు కౌన్సిల్‌ తీర్మానించినట్లు బల్దియా ఛైర్‌పర్సన్‌ రాణవేని సుజాత తెలిపారు. గురువారం ఆన్‌లైన్‌లో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించినట్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈనెల 16 నుంచి 31 వరకు పట్టణంలోని నిత్యావసర దుకాణాలు తప్పా మిగతా దుకాణాలన్ని స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని సూచించారు. నిత్యావసర సరకుల దుకాణాలు మాత్రం ప్రతి రోజు ఉదయం 11 గంటల వరకే తెరచి ఉంచాలని నిర్ణయిస్తూ కౌన్సిల్‌ తీర్మానించినట్లు ఛైర్‌పర్సన్‌ తెలిపారు. గురువారం ఒక్క రోజే పట్టణంలో 11 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పుర అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వార్డులలో పుర సిబ్బందితో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బల్దియా కోఆప్షన్‌ సభ్యుడు ఏశాల రాజశేఖర్‌, పుర శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ముజీబ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.