close

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన యువకుడికి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. ఆర్‌సీఎం చర్చి దగ్గర నివాసముంటున్న బాలస్వామి, రామేశ్వరమ్మ కుమారుడు విఘ్నేశ్‌(22) సెంట్రింగ్‌ కూలీగా పనిచేస్తున్నారు. పట్టణంలోని మిలటరీ కాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పైకప్పు సెంట్రింగ్‌ పనులు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఇనుప కడ్డీని పైకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణ భవనానికి ఆనుకుని ఉన్న విద్యుత్‌ తీగ తగిలి యువకుడు కిందపడ్డారు. తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.