close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

తాజా వార్తలు

డిసెంబర్‌-జనవరిల్లో జీవీఎంసీ ఎన్నికలు

ఎంపీ విజయసాయిరెడ్డి

ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులను గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డిసెంబర్‌-జనవరి నెలల్లో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెం నగర వైకాపా కార్యాలయంలో నగర కమిటీలు, నగర అనుబంధ కమిటీలు, వార్డు అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ త్వరలో జీవీఎంసీని వంద వార్డులుగా విభజిస్తామన్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్‌ సీటును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తిసుందన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడానికి నియోజకవర్గ నాయకులకు వారానికి ఒకసారైన అవకాశం కల్పించాలని విజయసాయిరెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు టి.నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌, శెట్టిపాల్గుణ, వీఎంఆర్‌డీఎ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. చివరిలో విజయసాయిరెడ్డి పశ్చిమ నియోజకవర్గ నాయకులు, వార్డు ప్రెసిడెంట్‌లతో సమావేశం నిర్వహించారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.