close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు: ఆర్‌.కృష్ణయ్య

నల్లకుంట, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈనెల 19న ఐకాస తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. 11 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించకపోవడం విచారకరమన్నారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో నిర్వహించిన వివిధ బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి సుమారు రూ.85 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాలని తెరాస ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అప్పగిస్తే బస్‌ ఛార్జీలు మూడు, నాలుగు రెట్లు పెరిగే అవకాశముందని ఆరోపించారు. సమ్మె కారణంగా విద్యా సంస్థలకు సెలవుల పొడగింపుతో 80 లక్షలకుపైగా విద్యార్థుల చదువు దెబ్బతింటుందన్నారు. ఈనెల 19న బంద్‌లో బీసీ సంఘాల నేతలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌, నరసింహాగౌడ్‌, కృష్ణయాదవ్‌, సతీశ్‌, చంద్రశేఖర్‌, శారద, స్వాతి, స్వప్న, గజేందర్‌, మహేందర్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

సమ్మెకు మోటారు ట్రాన్స్‌పోర్టు మద్దతు
ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తెలంగాణ రాష్ట్ర మోటార్‌ ట్రాన్స్‌పోర్టు జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బంద్‌లో పాల్గొంటున్నట్లు రవాణా కార్యాలయంలో జేటీసీ మమత ప్రసాద్‌కు నోటీసు అందజేశారు. ఆటో యూనియన్‌ జేఏసీ నేతలు అమానుల్లాఖాన్‌, బి.వెంకటేశం, క్యాబ్‌ జేఏసీ కన్వీనర్‌ సలావుద్దీన్‌, లారీ యూనియన్‌ ఉపాధ్యక్షులు రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. 48 వేల మంది కార్మికుల్ని తొలగించినట్లు ఏకపక్షంగా ప్రకటించడం సబబు కాదన్నారు. ధర్నాలో ఐఎస్‌టీయూ ఆటో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వి.కిరణ్‌, సీఐటీయూ క్యాబ్‌ యూనియన్‌ నేత అజయ్‌బాబు, టీఆర్‌సీపీటీయూ నేత సతీష్‌ పాల్గొన్నారు.

 

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.