close

బుధవారం, నవంబర్ 13, 2019

తాజా వార్తలు

అమరవీరుల త్యాగాలు ఎనలేనివి

అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్‌, డీఐజీ వెంకటరామిరెడ్డి,

కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల తాగ్యాలు ఎనలేనివని కర్నూలు రేంజి డీఐజీ వెంకట్రామిరెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కవాతు మైదానంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి డీఐజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు మరవలేనివని చెప్పారు. మనకు ప్రశాంత జీవనాన్ని అందించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.గిరిధర్‌ మాట్లాడుతూ అమరవీరుల త్యాగం ఉన్నతమైనదన్నారు. వారి త్యాగం వృథా కాదని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ అమరవీరుల త్యాగనిరతిని గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని, గడిచిన ఏడాది 292 మంది జవానులు, పోలీసులు అమరులయ్యారని చెప్పారు. అమరవీరుల స్ఫూర్తితోనే ప్రజా రక్షణ కోసం కమ్యూనిటీ సీసీ టీవీ ప్రాజెక్టు, సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, సైబర్‌మిత్ర, పోలీసు పోర్టల్‌, ప్రతిభావంతులైన పోలీసు పిల్లలకు పోలీసు పురస్కార కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌బాషా 292 మంది అమరవీరుల పేర్లు చదివి వినిపించారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, పరుగు పోటీల్లో విజేతలైన విద్యార్థులు, పోలీసులకు బహుమతులు అందించారు. అమర వీరులైన రాముడు, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జేసీ రవి పట్టన్‌శెట్టి, జేసీ-2 ఖాజా మొహిద్దీన్‌, నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.శ్రీనివాస్‌, అనిశా న్యాయమూర్తి భాస్కరరావు, కమిషనర్‌ రవీంద్రబాబు, ఓఎస్డీ ఆంజనేయులు, ఏఆర్‌ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు పాల్గొని నివాళులర్పించారు.

ఉచిత వైద్యం అందిస్తాం: ఎంపీ

పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందిస్తామని, వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని కర్నూలు ఎంపీ డాక్టర్‌ కె.సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏపీఎస్పీ రెండో పటాలంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆయన సోమవారం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏపీఎస్పీ మూడో రేంజి డీఐజీ వెంకటేశ్వర్లు, దళాధిపతి షేక్‌ హుస్సేన్‌సాహెబ్‌, అదనపు దళాధిపతి డాక్టర్‌ అల్లాబకాష్‌ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సహాయ దళాధిపతులు శశికాంత్‌, ఎస్‌.ఎం.బాషా, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.