close

శనివారం, డిసెంబర్ 07, 2019

తాజా వార్తలు

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

కురిక్యాల (గంగాధర), న్యూస్‌టుడే: కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మండలం కురిక్యాల శివారులో సోమవారం సాయంత్రం కారు అదుపు తప్పి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్‌ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు వేగంగా రోడ్డు కిందకు దూసుకెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. ఈ సంఘటనలో విద్యుత్తు స్తంభం విరిగి తీగలు కిందకు వేలాడాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.