close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

తాజా వార్తలు

నేరస్థులకు శిక్షలు పడటమే లక్ష్యం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : కోర్టుడ్యూటీ అధికారులు నేరస్థులకు శిక్షలు పడటమే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషన్‌ వి.బి కమలాసన్‌రెడ్డి అన్నారు. నేరస్థులు శిక్షింపబడటంతో నేరాలు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌ కేంద్రంలో కోర్టు డ్యూటీలను నిర్వహించే అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు విధులను నిర్వహించే పోలీసులు ఇతరులతో పోటీపడుతూ పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంపొందించడంతోపాటు, వృత్తికి న్యాయం చేయాలనే తపన కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తులో అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆధారపడి ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారు గొప్పవారని, ఆత్మనూన్యతభావంతో ఉండకుండా నేర్చుకునేందుకు ఆసక్తి చూపాలని కోరారు. సకాలంలో సమన్లను జారీ చేయడంతోపాటు, సాక్ష్యులను సరైన సమయంలో కోర్టులో హాజరుపర్చాలని చెప్పారు.
కోర్టు డ్యూటీ పోలీసులకు నగదు రివార్డులతోపాటు ప్రశంసాపత్రాలు అందిస్తామని ప్రకటించారు. సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ విద్యాసాగర్‌, ఐటీకోర్‌టీం, సీఎఫ్‌ఎల్‌ ఇన్‌ఛార్జి మురళి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.