close

శనివారం, ఆగస్టు 24, 2019

తాజా వార్తలు

ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

బి.తాండ్రపాడు కళాశాలలో శిబిరం ఏర్పాటు

● 20వ తేదీ వరకు నిర్వహణ 

● విద్యార్థుల్లో ఆసక్తి అంతంతే..

కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

గ్రామీణ యువతకు సాంకేతిక విద్య కోర్సులు ఆసరాగా నిలుస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నత విద్య వైపు వెళ్లేందుకు అవకాశాలు కల్పించడం.. ప్రాంగణ నియామకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటిపై విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో చాలామంది మక్కువ చూపడం లేదు. ఈ ఏడాది అందుబాటులో ఉన్న సీట్ల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువ రావడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం కర్నూలు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరుగుతోంది.

న్యూస్‌టుడే-కర్నూలు విద్య

జిల్లాలో ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాలలు 6, ప్రైవేటు కళాశాలలు 30 వరకు ఉన్నాయి. 4,912 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో ప్రవేశాలు లభిస్తున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా ఐ.టి.ఐ. కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదు. విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. దీనికితోడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండడంతోపాటు ఐటీఐతో బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్‌లో చేరేందుకు అవకాశం ఉంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా డిప్లొమో ద్వితీయ ఏడాదిలో చేరే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఐసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌, ఎంటెక్‌ చేసే వీలుంది.

ఉపాధి అవకాశాలు మెండు

కోర్సులో భాగంగా నైపుణ్యాలపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ చేపడుతోంది. ఉపాధి ప్రాంగణ నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. దీంతో ఇటీవలకాలంలో ప్రతి కళాశాలలో ప్రాంగణ నియామకాలకు పోటీ పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగ మేళాల ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు 650 మందికిపైగానే అవకాశాలు పొందారు. మరోవైపు అప్రెంటీసష్‌ిప్‌తో నైపుణ్య పనివార్లుగా గుర్తింపు లభిస్తుంది.

● పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ. కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్ఛు దీనికిగాను రూ.10 చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారు కౌన్సెలింగ్‌కు అర్హులు. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా కన్వీనర్‌ సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు తాము తీసుకున్న దరఖాస్తులో తమకు నచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల వివరాలను నమోదు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలి.

కౌన్సెలింగ్‌ ప్రారంభం

జిల్లాలో మొత్తంగా 4,912 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎంపిక చేసుకున్న ట్రేడ్‌లలో సీట్ల కేటాయింపు చేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 13 నుంచి ప్రారంభమైన ట్రేడ్‌ ఎంపిక ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం 15వ తేదీన 413 మంది, 16న 610 మంది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పొందారు.

అవకాశాన్ని ఉపయోగించుకోవాలి - నాయకల్లు సోలేమెన్‌, ఐ.టి.ఐ. కళాశాలల కన్వీనర్‌

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐటీఐ కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దీనికి అర్హులు. ప్రభుత్వ అధ్యయనం ప్రకారం జిల్లాలో ఐటీఐ చదివినవారిలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఎంపిక పత్రాన్ని అందజేస్తున్న కన్వీనర్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.