close
Updated : 07/06/2021 12:36 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

Health Tips: పచ్చగా తినేయండి

మామూలు రోజులతో పోలిస్తే వేసవిలో కొన్ని విటమిన్లు శరీరానికి తప్పక అవసరమవుతాయి. శక్తి వినియోగం, మెటబాలిజం పెరగడం ఇందుకు కారణాలు. వీటిని ఆకుకూరలతో భర్తీ చేసుకోవచ్చు. ఎన్నో జబ్బులకు వ్యతిరేకంగానూ ఇవి పనిచేస్తాయి.

చింత చిగురు: యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. గుండెజబ్బు, క్యాన్సర్‌, మధుమేహం వంటివి రాకుండా చేస్తుంది. గాయం మాన్పడంలోనూ తోడ్పడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం... శరీరంలో జరిగే 600కుపైగా క్రియలకు సాయపడుతుంది. దేహంలోకి చేరే బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగైలకు వ్యతిరేకంగానూ చింత చిగురు పనిచేస్తుంది.
చుక్కకూర: విటమిన్‌ సి గుణాలెక్కువ. ఆహారం త్వరగా అరగడంలో సాయపడటమే కాకుండా మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. బ్రాంకైటిస్‌, ఆస్తమాలకూ మంచి ఔషధం.
గోంగూర: ఫోలెట్‌, విటమిన్‌ బీ6తోపాటు ఐరన్‌, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్స్‌, క్యాల్షియం, జింక్‌, విటమిన్‌ ఎ దీనిలో సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని గుణాలు శరీరాన్ని చల్లబర్చడంలో సాయపడతాయి. మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం.. ఎముకలను దృఢపరుస్తాయి. జ్వర లక్షణాలను తగ్గించడంలోనూ పాత్ర పోషిస్తుంది.
పాలకూర: సి, ఎ విటమిన్లు ఎక్కువ. ఇవి రోగనిరోధశక్తికీ, కళ్ల ఆరోగ్యానికీ తోడ్పడతాయి. ఈ ఆకుకూరలో శరీరానికి అత్యవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. దీనిలో ఉండే ల్యూటిన్‌ రెటీనాని రక్షించి, దృష్టిపరమైన సమస్యలు రాకుండా చేస్తుంది. పొటాషియం గాయాల నుంచి రక్తాన్ని గడ్డకట్టించడంలో తోడ్పడుతుంది.

చిట్కా

డీహైడ్రేషన్‌ బారినపడ్డప్పుడు గంజిలో కాస్త మజ్జిగ, చిన్నగా తరిగిన నిమ్మ ఆకులు, కొంచెం ఉప్పు వేసి తాగితే మంచిది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని