close

తాజా వార్తలు

ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పుల కలకలం

ఆత్మకూరు: ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీప్యాట్‌ స్లిప్పులు భారీగా బయటపడ్డాయి. ఈ స్లిప్పును ఓ విద్యార్థి ‘ఈటీవీ’ ప్రతినిధికి తీసుకొచ్చి ఇచ్చారు. స్లిప్పుల కలకలం అంశాన్ని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు దృష్టికి ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ తీసుకెళ్లింది. ఇవన్నీ మాక్‌ పోలింగ్‌కు సంబంధించిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. నిబంధనల మేరకు ర్యాండమైజేషన్‌ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉంది. అయితే, కలెక్టర్‌ ద్వారా విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి అనేక కవర్లలో స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆర్డీవో సమక్షంలోనే సిబ్బంది తగులబెట్టారు. స్లిప్పుల కలకలంపై స్థానిక అధికారుల నుంచి వివరణను కోరనున్నట్టు కలెక్టర్‌ చెప్పారు.

ఆ స్లిప్పులు పోలింగ్‌ రోజువికాదు: ఆర్డీవో
ఆత్మకూరులో దొరికిన వీవీప్యాట్‌ స్లిప్పులు ఎన్నికల పోలింగ్‌ రోజువి కాదని ఆర్డీవో చినరాముడు స్పష్టంచేశారు. పోలింగ్‌కు ముందు అభ్యర్థుల సమక్షంలో వెయ్యి ఓట్లు వేయిస్తారని, సిబ్బందికి శిక్షణలో భాగంగా 5శాతం స్లిప్పులు తీస్తామని వివరించారు. ఆ స్లిప్పులను ఆరోజే ధ్వంసం చేయాల్సి ఉండగా..  కొన్ని స్లిప్పులను సిబ్బంది పాఠశాల ఆవరణలో వదిలి వెళ్లారని తెలిపారు.



మరిన్ని

ఎన్నికల షెడ్యూల్

లోక్‌సభ మూడో ద‌శ‌ ఎన్నికలు
(14 రాష్ట్రాల్లో - 115 స్థానాలు)
షెడ్యూల్‌ ప్రకటన 10-03-2019
నోటిఫికేషన్ 28-03-2019
నామినేషన్ల గడువు 04-04-2019
నామినేషన్ల పరిశీలన 05-04-2019
ఉపసంహరణ 08-04-2019
పోలింగ్ తేదీ 23-04-2019
ఓట్లు లెక్కింపు 23-05-2019
పూర్తి షెడ్యూల్

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net