close

తాజా వార్తలు

దేశవ్యాప్తంగా ప్రారంభమైన మూడో దశ పోలింగ్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వాస్తవానికి మూడో దశలో భాగంగా 115 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక రెండో దశ నుంచి మూడో దశకు వాయిదాపడింది. దీంతో నియోజకవర్గాల సంఖ్య 116కు చేరింది. రాహుల్‌గాంధీ, అమిత్‌షా, ములాయంసింగ్‌ యాదవ్‌, జయప్రద, వరుణ్‌ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్‌, మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు, ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్‌ ప్రారంభమైంది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net