కాకినాడలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

తాజా వార్తలు

Published : 16/10/2020 11:11 IST

కాకినాడలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

ప్రకాశం జిల్లా వాడరేవు తీరానికి తీసుకొచ్చిన కోస్టుగార్డు సిబ్బంది

చీరాల: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఇటీవల గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు సిబ్బంది ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు తీరానికి చేర్చారు. వారి వివరాలను మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 7న కాకినాడ తీరం నుంచి బోటులో చేపల వేటకు వెళ్లి ఈ మత్స్యకారుల గల్లంతయ్యారు. అదే సమయంలో బోటు ఇంజిన్‌ ఆగిపోవడం.. తీవ్ర వాయుగుండం కారణంగా దారితప్పిపోయారు. స్థానిక అధికారులు కోస్టుగార్డు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఒడ్డుకు చేరుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని