రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు

తాజా వార్తలు

Updated : 29/10/2020 15:25 IST

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని అభిప్రాయపడిన ఎన్జీటీ ..ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది.

పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతనెల 3న విచారణ పూర్తి చేసి ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెల్లడించింది. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు సామర్థ్యం రెట్టింపు చేసినందున పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించింది. రాయలసీమ ఎత్తిపోతల పాత ప్రాజెక్టేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన వాదనను ఎన్జీటీ తిరస్కరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని