Corona: ఏపీలో 27 మంది మృత్యువాత

తాజా వార్తలు

Updated : 19/04/2021 18:12 IST

Corona: ఏపీలో 27 మంది మృత్యువాత

అమరావతి: ఏపీలో కరోనా అంతకంతకూ తీవ్రతరమవుతోంది. కొవిడ్‌తో ఒక్కరోజు వ్యవధిలో 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,437కి చేరింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా 5,963 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, అత్యల్పంగా పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది.

ఒక్కరోజులో కొవిడ్‌ చికిత్స పొందుతూ మృతిచెందిన వారిలో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు.. గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. అనంతపురం జిల్లాలో ఒకరు ఉన్నారు. 24 గంటల వ్యవధిలో 2,569 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 48,053 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,15,757 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని