Black Fungus కేసులు దాయడం లేదు
close

తాజా వార్తలు

Published : 11/06/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungus కేసులు దాయడం లేదు

ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం 454 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఐసీయూ, పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4.04 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకూ టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులను ప్రభుత్వం దాయడం లేదని.. నోటిఫై చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఏకే సింఘాల్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 138 బ్లాక్‌ ఫంగస్‌ మరణాలు నమోదైనట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని