రెండు ఈశాన్య రాష్ట్రాల్లో.. తొలిసారిగా డెల్టా వేరియంట్‌
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:34 IST

రెండు ఈశాన్య రాష్ట్రాల్లో.. తొలిసారిగా డెల్టా వేరియంట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేగంగా వ్యాప్తి చెందుతూ కలవరపెడుతున్న కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ తాజాగా ఈశాన్య రాష్ట్రాలను చుట్టేస్తోంది. మణిపుర్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఈ రకం వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసింది. పరీక్ష కోసం మణిపుర్‌ నుంచి హైదరాబాద్‌కు 20 శాంపిళ్లు తీసుకురాగా.. వాటిలో 18 శాంపిళ్లలో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు సమాచారం. మిజోరాంలోని ఐజ్వాల్‌ జిల్లాలోనూ ఈ రకం వైరస్‌ సోకిన నాలుగు కేసులు బయటపడ్డాయి. పరీక్షించేందుకు వాటి శాంపిళ్లను పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌కు పంపారు. 

తొలిసారిగా భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీనిని వైద్యులు ప్రస్తుతం భౌగోళిక ముప్పుగా పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 దేశాల్లో డెల్టా వేరియంట్‌ వెలుగుచూసినట్లు తెలిపారు. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని