Corona: పరీక్షలకు ఖమ్మంలో బారులు
close

తాజా వార్తలు

Published : 07/05/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పరీక్షలకు ఖమ్మంలో బారులు

ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలో కొవిడ్‌ పరీక్షల కోసం ప్రజలు బారులుతీరారు. పాతబస్టాండు వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో వందలాది మంది పడిగాపులు కాస్తున్నారు. ప్రజల్లో అవగాహన ఏర్పడుతుండటంతో చిన్నపాటి అనుమానిత లక్షణం ఉన్నా పరీక్షలకు తరలి వస్తున్నారు. ఖమ్మంలో ఉదయం 5 గంటల నుంచే వేచి ఉంటున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించలేక తమ చెప్పులను వరుసలో పెట్టారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుండటంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని అన్ని కేంద్రాల వద్దా రద్దీ నెలకొంటోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక్కొక్కరిని పరీక్షించేందుకు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతోంది. దీంతో ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని