AP: వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలు

తాజా వార్తలు

Updated : 23/04/2021 17:09 IST

AP: వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలు

అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబోరేటరీ (వీఆర్‌డీఎల్‌)ల ద్వారా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కరోనా పరీక్షల నిర్వహణకు 533మంది సిబ్బందిని నియమించగా.. ఇప్పుడు కొత్తగా మరో 110 టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆళ్లనాని తెలిపారు. ప్రతి వీఆర్‌డీఎల్ కేంద్రంలో పరీక్షలు చేసేందుకు రీసెర్చర్‌తో పాటు రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటాఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్‌ పోస్తులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రోజూ 40వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. కొత్తగా సిబ్బందిని నియమించడం ద్వారా నిత్యం 60వేలకుపైగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ట్రూనాట్ యంత్రాల ద్వారా గతంలో రోజుకి 10వేల పరీక్షలు నిర్వహించామని.. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని