Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Updated : 15/08/2021 04:26 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

ప్రయత్నకార్యసిద్ధి కలదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. ప్రయోజనకరమైన భాషణం చేయండి. ఇష్టదేవతాస్తోత్రం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు. 

శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

గొప్ప శుభకాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మిశ్రమకాలం. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో మంచి జరుగుతుంది.

ఆత్మవిశ్వాసంతో చేసే పనులు పూర్తవుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పట్టుదలతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శని, గురు అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ముఖ్య విషయాల్లో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. శివ సహస్ర నామం పఠించడం వల్ల బాగుంటుంది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఇష్టదేవతానామాన్ని జపించాలి.

ఉత్సాహంగా ముందుకు సాగండి. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని