కుక్క పిల్లల కోసం..పాముల బావిలో దిగి.!

తాజా వార్తలు

Published : 24/01/2020 06:01 IST

కుక్క పిల్లల కోసం..పాముల బావిలో దిగి.!

లఖ్‌నవూ: స్వార్థం లేకుండా పని చేసిన ఉద్యోగులకు ప్రజల మన్ననలు ఎప్పుడూ ఉంటాయనడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. పాడుబడ్డ బావిలో పడిపోయిన కుక్క పిల్లలను ప్రమాదకర పరిస్థితిలో రక్షించిన పోలీసు అధికారి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అంతేకాకుండా ఓ ఫోన్‌ కాల్‌కు అక్కడి పోలీసులు స్పందించిన తీరును ప్రశంసిస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆర్మోహాలో ఓ పాడుబడ్డ బావిలో మూడు కుక్కపిల్లలు పడిపోయాయి. స్థానికులు టోల్‌ఫ్రీ నంబర్‌ 112కు కాల్‌చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఓ పోలీసు అధికారి ఆ బావిలో దిగేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందులో పాములున్నాయంటూ స్థానికులు వారించారు. అయినా, వినకుండా ప్రాణాలకు తెగించి ఆ మూడు కుక్కపిల్లలను బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.

అంతేకాకుండా ఆ చిత్రాలను అక్కడి ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ట్విటర్‌లో పోస్టు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేయాలన్న సందేశాన్ని దానిపై ఉంచింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘బిగ్ సెల్యూట్‌ టు ఆఫీసర్‌’ ‘ఇలాంటి వారే భరతమాత ముద్దుబిడ్డలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని