తెలంగాణలో పది పరీక్షలు వాయిదా

తాజా వార్తలు

Updated : 30/03/2020 18:50 IST

తెలంగాణలో పది పరీక్షలు వాయిదా

హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో మంగళవారం నుంచి జరగాల్సిన పది పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నేటి వరకు పరీక్షలను వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్‌ దృష్ట్యా 31 నుంచి ఏప్రిల్‌ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రేపటి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి..
‘తెలంగాణలో పది పరీక్షలు వాయిదా వేయండి’Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని