తాడేపల్లిలో కరోనా కలకలం

తాజా వార్తలు

Updated : 10/05/2020 08:53 IST

తాడేపల్లిలో కరోనా కలకలం

ఈనాడు-గుంటూరు: తాడేపల్లిలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట రెండు కేసులు నమోదు కాగా శనివారం మరో రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇంతకు ముందు స్థానికంగా మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏడు కేసులు ఇక్కడ రావటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వీరిలో ఒకరు కరోనాతో చనిపోయినట్లు గతంలోనే ప్రకటించారు. శనివారం నమోదైన రెండు కేసులు ప్రకాష్‌నగర్‌లో వచ్చాయి. ఈ రెండు కేసులకు మూలాలు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. ప్రకాష్‌నగర్‌లో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడు. అతనికి స్వాబ్‌ తీయగా కరోనాగా నిర్దారణ అయింది. వెంనే విజయవాడ, తాడేపల్లిలో ఉంటున్న ఆయన కుటుంబీకులు 43 మందిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో కొన్ని ఫలితాలు శనివారం వచ్చాయి. అందులో చనిపోయిన వ్యక్తి భార్య, ఆయన కుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.  చనిపోయిన వ్యక్తి విజయవాడ మాచవరంలో ఉంటూ అనారోగ్యానికి గురి కాగా అతన్ని తొలుత విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది కొవిడ్‌ ఆస్పత్రి కావడంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి తాడేపల్లిలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లి అక్కడి నుంచి జీజీహెచ్‌కు వచ్చారని, చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు చెప్పారు. అంత్యక్రియల కోసం విజయవాడ నుంచి బంధువులు తాడేపల్లి రాకపోకలు సాగించారని చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని