రేపు అమిత్‌షాతో జగన్‌ భేటీ

తాజా వార్తలు

Updated : 01/06/2020 14:57 IST

రేపు అమిత్‌షాతో జగన్‌ భేటీ

అమరావతి : కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత తొలిసారిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయనతో చర్చించనున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా సీఎం కేంద్ర హోంమంత్రిని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివరంగా సీఎం రెండు లేఖలు రాశారు. కౌన్సిల్ రద్దు అంశంతో పాటు ఎస్ఈసీ వ్యవహారం కూడా ఇరువురి మధ్యా చర్చకు వచ్చే అవకాశముంది. అమిత్‌షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతోనూ ముఖ్యమంత్రి బేటీ కానున్నట్టు తెలుస్తోంది. దిల్లీ పర్యటన అనంతరం సీఎం బుధవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని