Top Ten News @ 1 PM
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 13:08 IST

Top Ten News @ 1 PM

1. పరీక్షలపై ఇప్పటికిప్పుడే తేల్చండి: సుప్రీం

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అఫిడవిట్‌లో అది ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

2. AP news: జగన్‌ కేసుల విచారణలో వేగమేది?

వివిధ ఆర్థిక కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులను ఈడీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని, ఈ ముగ్గురి కేసుల్లో ఉన్న వేగం సీఎం జగన్‌ కేసుల్లో లేకపోవడం శోచనీయమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌కు చెందిన రూ.43 వేల కోట్ల అక్రమ సంపదనంతా స్వాధీనం చేసుకొని, ప్రజాపరం చేయాలని డిమాండ్‌ చేశారు.

3. Ap News: జగన్‌కు రఘురామ మరో లేఖ

చట్టబద్ధమైన పోస్టులో వయస్సు సడలింపుతో నియమించడం తగదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు నవ కర్తవ్యాల పేరుతో రఘురామ ఈ మేరకు ఐదో లేఖ రాశారు. ఏపీ పోలీస్‌ కంప్లెయింట్స్‌ అథారిటీ(పీసీఏ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ వి.కనగరాజు నియామకాన్ని రఘురామ తప్పుబట్టారు. 65 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే పదవికి అర్హులని తన లేఖలో పేర్కొన్నారు. 

4. AP news: నవ్యాంధ్రను హత్యాంధ్రగా మార్చారు: అచ్చెన్న

నవ్యాంధ్రప్రదేశ్‌ను వైకాపా ప్రభుత్వం హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో తెదేపా కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైకాపా అరాచకాలపై సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.  

5. Delta: 85 దేశాల్లో గుర్తింపు.. WHO ఆందోళన

ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగితే.. వేగంగా ప్రబలే స్వభావమున్న డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్రతివారం విడుదల చేసే నివేదికల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ హెచ్చరిక జారీ చేసింది. ఈ కరోనా రకాన్ని ఇప్పటికే 85 దేశాల్లో గుర్తించిన నేపథ్యంలో.. ఆందోళన వ్యక్తం చేసింది. వేగంగా వ్యాప్తి చెందుతూ,  

6. ఇక్కడి న్యాయమూర్తి.. జపాన్‌లో దేవుడు!

జస్టిస్‌ రాధాబినోద్‌ పాల్‌.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మన భారత చరిత్రలో ఈయన పేరు పెద్దగా ప్రస్తావించి ఉండకపోవచ్చు. చరిత్రకారులు, సామాన్య భారతీయులు ఆయన్ను గుర్తించకపోవచ్చు. కానీ, జపనీయులు ఆయన్ను దేవుడిలా భావిస్తున్నారు. దేవాలయాల్లో ఆయన స్మారక చిహ్నాలు స్థాపించి ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆయన? ఏం చేశాడని దేవుడంటున్నారు? 1886 జనవరి 27న అప్పటి బెంగాల్‌ ప్రావిన్స్‌లో జన్మించిన జస్టిస్‌ రాధాబినోద్‌ పాల్‌.. కోల్‌కతా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 

ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ!

7. Rahul Gandhi: సూరత్‌ కోర్టుకు హాజరైన రాహుల్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం గుజరాత్‌లోని సూరత్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నేడు న్యాయస్థానానికి వచ్చారు. 2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్‌ ఓ ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఇది వివాదానికి దారితీసింది. 

8. DeltaPlus: నెల రోజుల కిందటే డెల్టాప్లస్‌తో మరణం..!

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి అదుపులోకి వస్తున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ రకం కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ మరణానికి ‘డెల్టా ప్లస్‌’ కారణంగా తేలింది. ఈ వేరియంట్‌లో ధ్రువీకరించిన తొలి మరణం ఇదే. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్‌ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. 

9. Corona: 30 కోట్ల మైలురాయి దాటిన టీకాలు..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 18,59,469 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..54,069 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,00,82,778కి చేరగా.. 3,91,981 మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 6.27 లక్షలకు తగ్గగా.. ఆ రేటు 2 శాతానికి సమీపంలో ఉంది. 

10. WTC Final: కోహ్లీ కౌగిలిలో వినమ్రంగా కేన్‌.. వైరల్‌

ఒక చిత్రం వెయ్యి మాటల పెట్టు! నోటితో చెప్పలేని ఎన్నో మాటలను.. చూపులతో వ్యక్తీకరించలేని ఎన్నో భావోద్వేగాలను ఒక చిత్రం స్పష్టంగా చూపించగలదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక విరాట్‌ కోహ్లీ.. కేన్‌ విలియమ్సన్‌ను హత్తుకోవడం ఇలాంటిదే. ఓటమి బాధలో ఉన్న విరాట్‌ కౌగిలిలో కేన్‌ స్నేహపూర్వకంగా విన్రమంగా ఒదిగిపోయాడు. ఆ అద్భుత క్షణంలో బంధించిన చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

WTC Final: కోహ్లీసేనలో భారీ మార్పుల సూచన!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని