Ap News: సీఎం జగన్‌ ఇంటి వద్ద హైఅలర్ట్‌
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 09:57 IST

Ap News: సీఎం జగన్‌ ఇంటి వద్ద హైఅలర్ట్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద పోలీసు శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. నేటితో రాజధాని రైతుల ఉద్యమం 550వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని