రాజధాని తరలింపు పిటిషన్లపై విచారణ వాయిదా

తాజా వార్తలు

Updated : 03/05/2021 19:23 IST

రాజధాని తరలింపు పిటిషన్లపై విచారణ వాయిదా

అమరావతి: రాజధాని తరలింపు అంశంపై విచారణను హైకోర్టు ఆగస్టు 23కి వాయిదా వేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాలను సవాల్‌ చేస్తూ సుమారు 90 వరకు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్నందున రాజధాని వ్యాజ్యాలపై  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా హైబ్రీడ్‌ విధానంలో విచారణ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు లేఖ రాశారు. వారి అభ్యర్థనపై  సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ ఏడాది మార్చి 26న తొలిసారి విచారించి తదుపరి విచారణను మే 3 నుంచి చేపట్టాలని నిర్ణయించింది. అయితే,  ఇందులో భాగంగా ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుతం కరోనాతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వేసవి సెలవుల దృష్ట్యా విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని