Whatsapp: ‘బ్లాక్‌’ అయ్యామా? తెలుసుకోండిలా!

తాజా వార్తలు

Updated : 13/07/2021 15:02 IST

Whatsapp: ‘బ్లాక్‌’ అయ్యామా? తెలుసుకోండిలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: గాళ్‌ఫ్రెండ్‌కి వాట్సాప్‌ చేస్తే ఎంతకీ రిప్లై ఇవ్వట్లేదు. అసలు మెసేజ్‌లు చదివిందా, లేదా? అనే అనుమానం! అప్పు తీసుకున్న స్నేహితుడికి కాల్‌ చేస్తే ఎంతకీ కలవదు. ఎందుకిలా? బహుశా మిమ్మల్ని ‘బ్లాక్‌’ చేశారేమో! మరి తెలుసుకోవడం ఎలా? ఇదిగో ఇలా.

ప్రొఫైల్‌ పిక్చర్‌ కనపడదు: అవతలి వ్యక్తుల డీపీ మనకు కనిపించడం లేదంటే మొదటి సంకేతం మనం బ్లాక్‌ లిస్టులో ఉన్నట్టే. మరి చాలామంది ప్రొఫైల్‌ పిక్చర్‌ పెట్టుకోరుగా అనే అనుమానం రావడం సహజమే కదా. అలాంటప్పుడు ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ పరిశీలించాలి. అక్కడ ఫొటో ఉండి, వాట్సాప్‌లో లేదంటే మీరు బ్లాక్‌ అయినట్టే.

లాస్ట్‌ సీన్‌ ఉండదు: గోప్యత కోసం చాలామంది ‘లాస్ట్‌ సీన్‌’ ఆప్షన్‌ని డిజేబుల్‌ చేస్తారు. కానీ, మనం బ్లాక్‌లో ఉన్నా ఇదే సీన్‌. రోజులకొద్దీ అవతలివాళ్ల జాడ లేదంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.

ఒకే టిక్‌: మనం మెసేజ్‌ పంపినప్పుడు ఒక టిక్‌, అది డెలివర్‌ అయితే రెండు టిక్‌లు కనిపించడం సహజం. వాళ్లు మన సందేశం చదివితే రెండు టిక్‌లు నీలి రంగులోకి మారిపోతాయి. ఇవేం జరగకుండా ఎన్ని మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపినా ఒకే టిక్‌ మాత్రమే కనిపిస్తే బ్లాక్‌లో ఉన్నట్టే. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినా, సిగ్నల్‌ సరిగా లేకపోయినా ఇదే పరిస్థితి కదా అంటారా? కానీ, డేటా ఆన్‌ చేసినప్పుడు ఒక్కసారైనా మన సందేశాలు చేరుకోవాల్సిందే. అలా జరగలేదంటే కచ్చితంగా బ్లాక్‌ లిస్టులో ఉన్నట్టే.

కాల్స్‌ వెళ్లవు: అవతలి వాళ్ల చేతిలో బ్లాక్‌ అయిపోతే మనం ఎంత ప్రయత్నించినా ఆడియో, వీడియో కాల్స్‌ చేయడానికి వీలవదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని