Green Mission: వీడియో పంచుకున్న కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 11/07/2021 15:44 IST

Green Mission: వీడియో పంచుకున్న కేటీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన నుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ‘గ్రీన్ మిషన్’ కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా ఉన్న 19 ఇంటర్ ఛేంజ్‌లను పచ్చనితోరణంగా మార్చిన దృశ్యాలను కనువిందుగా చూపిస్తూ.. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వీడియోను పంచుకున్నారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా, మధ్యలో నాటిన మొక్కలు చిగురులు తొడిగి పచ్చగా కనువిందు చేస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌తో అనుసంధానంగా ఉన్న కూడళ్లలో వివిధ ఆకారాల్లో నాటిన మొక్కలు ఆకర్షిస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని