CrowdFunding: వారం రోజుల్లో ₹ 18 కోట్లు..!

తాజా వార్తలు

Published : 06/07/2021 19:52 IST

CrowdFunding: వారం రోజుల్లో ₹ 18 కోట్లు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌:  అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దాతలు చేయి చేయి కలిపారు. చిన్నారి చికిత్సకు అవసరమైన రూ.18 కోట్లను సమకూర్చారు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని మరోసారి నిరూపించారు. కేరళకు చెందిన ఏడాదిన్నర వయసున్న చిన్నారి మహమ్మద్‌ ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ’ అనే అరుదైన జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ వ్యాధిని నయం చేయడానికి అవసరమైన మందు చాలా ఖరీదైంది. దానిని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.18 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అయితే క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా వైద్యానికి అవసరమైన సొమ్మును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల ద్వారా చిన్నారి అనారోగ్య పరిస్థితిని వివరించారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న దాతలు వేగంగా స్పందించడంతో కేవలం వారం రోజుల్లోనే రూ.18 కోట్లు సమకూరాయి. క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం తెరచిన ఖాతాలో చికిత్సకు అవసరమైన సొమ్ము మొత్తం జమ అయినట్లు ట్రీట్‌మెంట్‌ కమిటీ తెలిపింది. ఇకపై ఎవరూ డబ్బు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆ మందును చిన్నారికి రెండేళ్లు నిండేలోగా ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ మందును విదేశాల నుంచి తెప్పించాల్సి ఉండటంతో అందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ విజ్ఞప్తి చేసింది. మహమ్మద్‌ సోదరి ఆఫ్రా(15)కు కూడా చిన్నతనంలో ఇదే వ్యాధి సోకడంతో ఆమె ప్రస్తుతం చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సి వచ్చింది.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని