TS news: హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

తాజా వార్తలు

Published : 05/08/2021 15:14 IST

TS news: హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్‌ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోవిడ్ కారణంగా గతేడాది నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ ఏడాది అనుమతిస్తున్నారా? అని  ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని న్యాయవాది విన్నవించారు. కొవిడ్‌ మహమ్మారి ఎప్పుడైనా ఉప్పెనలో విజృంభించవచ్చని, వైరస్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. ప్రతీ ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికింది. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా అందంగా ఉంచాలని కోరింది. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడింది. గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయమేంటో తెలపాలని కోరుతూ విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని