NGT: పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం

తాజా వార్తలు

Updated : 28/09/2021 04:07 IST

NGT: పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం

హైదరాబాద్‌: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖల వ్యవహారశైలిపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని మండిపడింది. చర్యలకు ఆదేశించేంత వరకూ అధికారుల్లో చలనం రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుపై అక్టోబరు 1లోగా నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), అటవీ, పర్యావరణ శాఖలను ఎన్జీటీ ఆదేశించింది.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ కోసమే పనులు చేపట్టామని ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. అక్రమాలు జరిగాయని నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రాజెక్టు పనులకు సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. చేసిన పనులు దాయలేదని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. డీపీఆర్‌ కోసం ఎంత పని చేయాలో ఎక్కడా విధివిధానాలు లేవని ఈ సందర్భంగా ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని