‘మైసమ్మ’ పాటతో ఆకర్షిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌!

తాజా వార్తలు

Published : 02/03/2021 00:58 IST

‘మైసమ్మ’ పాటతో ఆకర్షిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌!

నాగకర్నూల్‌ జిల్లా: నాగర్‌కర్నూల్‌లో ఓ బస్సు డ్రైవర్‌ మైసమ్మపై పాట పాడి ఆకట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి పెద్దకొత్తపల్లి మండలం నాయిన్‌పల్లి మైసమ్మకు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సుల్ని నడుపుతారు. ఈ నేపథ్యంలోనే నిన్న అమ్మవారి దగ్గరకు వెళ్లేందుకు బస్సు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు మైసమ్మ పాటపాడి అలరించారు. కరోనాతో కష్టకాలంలో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని డ్రైవర్‌ శాంతయ్య పేర్కొన్నాడు. అయితే, ఆయన పాట పాడుతూ.. అలరించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని