Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 02/05/2021 13:07 IST

Top 10 News @ 1PM

1. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేశాయ్‌..!

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూసినట్లయితే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంలో అధికార పార్టీల హవానే కొనసాగుతోంది. పుదుచ్చేరీలో కాంగ్రెస్‌, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. Corona: ఒక్కరోజే 3,689 మంది మృతి 

దేశంలో కరోనా రక్కసి వికటాట్టహాసం చేస్తోంది. ప్రమాదకరస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3600 మందికి పైగా వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ఇక రోజువారీ కేసులు అంతక్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గడం గమనార్హం. తాజాగా దేశంలో 3.92 లక్షల మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Nandigram ఆరో రౌండ్‌ తర్వాత ముందంజలో దీదీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్‌ దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్‌ నియోజకవర్గం ఫలితం క్షణక్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలి రౌండ్లలో మమతా బెనర్జీ వెనుకంజలో ఉండగా.. ఆరో రౌండ్‌ తర్వాత ఆమె ఆధిక్యంలోకి వచ్చారు. ఆరు రౌండ్ల అనంతరం మమత.. తన సమీప భాజపా ప్రత్యర్థి సువేందు అధికారిపై 1427 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున సువేందు అధికారి దాదాపు  81వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే

4. నాగార్జునసాగర్‌: ఆధిక్యంలో తెరాస

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక్కడ తెరాస అభ్యర్థి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 8139 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. తిరుపతి: కొనసాగుతున్న గురుమూర్తి ఆధిక్యం

లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో వైకాపా అభ్యర్థి 80 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. గురుమూర్తికి 1,89,174 ఓట్లు, తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,07,321, భాజపా అభ్యర్థి రత్నప్రభకు 18,296 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు 3,011 ఓట్లు పోలయ్యాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. TS Covid: 7,430 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 76,330 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7,430 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 56 మంది మరణించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. టీవీ చర్చాకార్యక్రమాలకు కాంగ్రెస్‌ దూరం

నేడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీవీ చర్చా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులెవరూ టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆదేశించారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని అన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. థాంక్స్‌ అన్న Pollard.. వైఫల్యమేనన్న MS Dhoni

భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తన అలవాటని ముంబయి ఇండియన్స్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. చిన్నమైదానం, హిట్టర్లు ఉండటంతో సానుకూలంగా ఆడాలని భావించామని కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. భారీ స్కోరు చేసినప్పటికీ ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యామని చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ పేర్కొన్నాడు. పొలార్డ్‌ను చూసి గర్విస్తున్నామని హార్దిక్‌ పాండ్య అంటున్నాడు. శనివారం చెన్నై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఛేదించిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. Lock Down: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా  ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. corona కట్టడికి ‘నకిలీ’ సలహాలు

ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా చస్తుంది.. చేతిలో నెబులైజర్‌ ఉంటే ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం లేదు.. కర్పూర మిశ్రమంతో ప్రాణవాయువు స్థాయి అమాంతం పెరిగిపోతుంది.. కరోనా తగ్గాలంటే ఈ విధానాన్ని అవలంబించండి, ఆక్సిజన్‌ స్థాయిలు పెరగాలంటే ఇలా చేయండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన కొన్ని వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని