Top 10 News @ 9AM
close

తాజా వార్తలు

Published : 17/06/2021 09:01 IST

Top 10 News @ 9AM

1.China: పొరుగునున్న చైనాతో జాగ్రత్త

పొరుగున ఉన్న చైనాతో జాగ్రత్తగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తాను హెచ్చరించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రచ్ఛన్నయుద్ధం నాటి రోజులు కావని, సరిహద్దుల్లోని చైనా దూకుడును గమనించాలని తాను కోరినట్లు తెలిపారు. రష్యాతో సన్నిహిత సంబంధాలకు అమెరికా సిద్దంగా ఉందని, ఈ చర్చలను మున్ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. CBN: ధాన్యం బ‌కాయిలు చెల్లించాలి: చంద్రబాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రైతుల నుంచి సేక‌రించిన ధాన్యం బ‌కాయిలు వెంట‌నే చెల్లించాల‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. బ‌కాయిల చెల్లింపుల్లో జాప్యం వ‌ల్ల రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్నారు. మ‌ద్ద‌తు ధ‌ర కొనుగోళ్ల‌లోనూ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని చంద్ర‌బాబు ఆక్షేపించారు. రైతుల‌ను నిండా ముంచే విధానాల‌ను అవ‌లంబిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. TS News: 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత?

రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వ్యవసాయ సీజన్‌ వేగం పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Vaccine: టీకా తీసుకున్న 95% మందికి వైరస్‌ సోకలేదు

వ్యాక్సిన్లతో కరోనాకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని అపోలో గ్రూపు ఆసుపత్రుల తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 24 నగరాల్లోని 43 అపోలో ఆసుపత్రుల్లో దాదాపు 31,621 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ఈ వివరాలను అపోలో ఆసుపత్రి గ్రూపు బుధవారం మీడియాకు విడుదల చేసింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మొదటి లేదా రెండు డోసులు తీసుకున్న 95 శాతం సిబ్బందికి ఎలాంటి వైరస్‌ సోకలేదని అందులో తేలింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. Deep Ocean Mission: సాగర మథనానికి సై

సముద్ర గర్భంలో దాగిన అనంతమైన సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వాటిని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.4,077 కోట్ల వ్యయంతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ చేపట్టనుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఆసుపత్రులకు తగ్గిన తాకిడి

రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నెలరోజుల కిందటి వరకు కొవిడ్‌ రోగులకు పడకలు దొరకడం గగనమే. ప్రస్తుతం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కేసుల సంఖ్య తగ్గిపోవడంతో గాంధీ, టిమ్స్‌లాంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో పడకలు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల కోసం కేటాయించిన పడకలను గణనీయంగా తగ్గించి సాధారణ చికిత్స కోసం కేటాయిస్తున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. CoronaVaccine: త్వరలో చిన్నారులకూ టీకాలు

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకూ త్వరలోనే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు మరో ప్రొటీన్‌ ఆధారిత టీకా ఈ మేరకు ప్రాథమిక ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా పరిశోధనల్లో భాగంగా వారు 16 పిల్ల కోతులను రెండు బృందాలుగా చేశారు. వాటిలో ఓ బృందానికి మోడెర్నా, మరో వర్గానికి ప్రొటీన్‌ ఆధారిత టీకా అందించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. 30,00,000 బీపీఓ ఉద్యోగాల గల్లంతు!

రిశ్రమలన్నీ ఆటోమేషన్‌కు (యాంత్రీకరణ) మారిపోతున్న తరుణంలో టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ సాఫ్ట్‌వేర్‌ రంగంలో 1.6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుండగా, 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయని తెలిపింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ప్రశాంతమే.. కానీ ప్రమాదం

ఆ జట్టు బరిలో దిగుతుందంటే పెద్దగా హడావిడి ఉండదు. జెంటిల్‌మన్‌ గేమ్‌ను జెంటిల్‌మెన్‌ లాగే ఆడతారు ఆ జట్టు ఆటగాళ్లు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా మైదానంలో అడుగు పెట్టే ఆ జట్టు.. ప్రశాంతంగా పని కానిచ్చేస్తుంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారుతుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ‘డేటా సెంటర్ల’ కేంద్రం హైదరాబాద్‌

డేటా సెంటర్లను హైదరాబాద్‌ నగరం పెద్దఎత్తున ఆకర్షిస్తోందని రియల్‌ ఎస్టేట్‌ కన్సెల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. దీనివల్ల హైదరాబాద్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 2023 నాటికి మూడు రెట్లు పెరగనుందని, తత్ఫలితంగా ఇక్కడ డేటా పరిశ్రమ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని ‘2020 ఇండియా డేటా సెంటర్‌ మార్కెట్‌ అప్‌డేట్‌’ అనే నివేదికలో జేఎల్‌ఎల్‌ విశ్లేషించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని