Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొగల్రాజపురం(విజయవాడ సిటీ): కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి, విజయవాడను గురువారం యూరోపియన్‌ బృందం సందర్శించింది. రౌండ్‌ టేబుల్‌ ఇండియా, పార్టీఒన్‌క్లబ్‌ నిర్వహిస్తున్న సాంస్కృతిక బృందాల మార్పిడి పథకంలో భాగంగా రౌండ్‌ టేబుల్‌ ఇండియా ప్రతినిధి దండమూడి సీతారాం ఆధ్వర్యంలో బెల్జియం, డెన్మార్క్‌, ఆస్ట్రియా, జర్మనీ తదితర దేశాలకు చెందిన 12 మంది సభ్యుల బృందం ఇక్కడకు వచ్చారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడ ఏర్పాటుచేస్తున్న చిత్ర, శిల్పకళ, నాట్య ప్రదర్శనలు, వారసత్వ సంపదను పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యలను సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో మాలక్ష్మి సంస్థల ప్రతినిధులు మాకినేని చింపిరయ్య, నారాయణరావు, బాలకృష్ణ, దుర్గాసాగర్‌, పద్మ శేఖర్‌ పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన