ప్రధానాంశాలు

Published : 06/05/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL నిర్వహణకు ఇంగ్లిష్‌ కౌంటీ క్లబ్‌ల ఆసక్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిరవధిక వాయిదా పడడంతో సెప్టెంబర్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌లోని నాలుగు కౌంటీ క్రికెట్‌ క్లబ్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం సెప్టెంబర్‌ రెండో అర్ధ భాగంలో లార్డ్స్‌, ఓవల్‌, ఎడ్జ్‌బాస్టన్‌, ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానాల్లో ఆయా మ్యాచ్‌లు నిర్వహించాలని మిడిల్‌సెక్స్‌, సర్రే, వార్క్‌షైర్‌, లాంకషైర్‌ క్లబ్‌లు నిర్ణయం తీసుకున్నాయి.

మరోవైపు భారత్‌లో ఈ ఏడాది చివర్లో కరోనా మూడో దశ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో బీసీసీఐ సైతం మిగిలిన మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని భావిస్తోంది. రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించి రెండు, మూడు వారాల్లో టోర్నీని పూర్తిచేసేలా ఆలోచనలు చేస్తోంది. అందుకోసం సెప్టెంబర్‌ నెలనే ఎంపిక చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ, ఈసీబీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సెప్టెంబర్‌లోనే మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయడానికి ఇంకో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. అదేంటంటే అక్టోబర్‌-నవంబర్‌లో యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు ఉన్నందున అందరి ఆటగాళ్లకు ఆ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రాక్టీస్‌లా ఉపయోగపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ రెండు ఈవెంట్లు యూఏఈలోనే నిర్వహిస్తే పిచ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండే సరైన వేదికగా కనిపిస్తోంది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net