ప్రధానాంశాలు

Published : 06/05/2021 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL:అనుజ్ రావత్‌కు బట్లర్ స్పెషల్ గిప్ట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కొవిడ్ బారినపడుతుండటంతో ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు చేరుకుంటున్నారు. రాజస్థాన్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ కూడా లండన్‌ బుధవారం చేరుకున్నాడు. లండన్‌కు  బయలుదేరకముందు బట్లర్‌.. అనుజ్‌ రావత్‌కు ఓ స్పెషల్ గిప్ట్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తాను ఉపయోగించిన కీపింగ్ గ్లౌజులపై ‘బెస్ట్‌ విషెస్‌ టూ అనూస్‌’ అని రాసి, రావత్ క్యాప్‌పై సంతకం చేసి ఇచ్చాడు. ఈ ఫొటోలను రాజస్థాన్ రాయల్స్ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ‘‘విధ్వంసకరమైన ఆటగాడి నుంచి మరొకరికి ఏదో ఒకటి ఉంచాలి’ అనే వ్యాఖ్యను జతచేసింది. మరో రాజస్థాన్‌ యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌కు కూడా బట్లర్ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

  అనుజ్‌ రావత్‌.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ ఆటగాడిని 2020లో రాజస్థాన్ రాయల్స్‌ రూ.80 లక్షలకు సొంతం చేసుకుంది. 2021 ఐపీఎల్ సీజన్‌కు అంతే మొత్తం చెల్లించి రిటైన్ చేసుకుంది.ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో అనుజ్‌ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.  బట్లర్‌ 124 పరుగులతో చెలరేగడంతో రాజస్థాన్  220 పరుగుల భారీ స్కోరును సాధించింది.  ఇందులో  సంజూ సేన.. 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రావత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net