close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. జగదాంబ సెంటర్‌లో తేల్చుకుందాం: బొండా ఉమా

విశాఖలో జగన్‌ భూకబ్జాలు బయటపడతాయనే తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్‌ రౌడీయిజానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. విశాఖ జగదాంబ సెంటర్‌లో తేల్చుకుందాం.. అని జగన్‌కు సవాల్‌ విసిరారు. ‘‘త్వరలో విశాఖకు చంద్రబాబు వస్తారు .. అప్పుడు అడ్డుకోండి చూద్దాం. నిన్న పోలీసుల అండతోనే రౌడీయిజం చేశారు. విశాఖలో ప్రజాస్వామ్యం ఖూనీపై కోర్టుకెళ్తాం. విశాఖ ఘటనపై ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’’ అని బొండా ఉమా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పోలవరం పనులను పరిశీలించిన జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పోలవరం పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం చేరుకున్న సీఎం.. ప్రాజెక్టు ప్రాంతంలో పనుల పురోగతిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్‌ వద్ద గత్తేదారులు, ఇంజినీర్లు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. నిర్వాసిత గ్రామాల పునరావాస పనులపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశమై చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చైనా వెలుపల విజృంభిస్తున్న కరోనా..

జపాన్‌, దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ ఆయా దేశాల నుంచి వచ్చేవారికి ‘వీసా ఆన్‌ అరైవల్‌’ సదుపాయాన్ని రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖలోని ఇమ్మిగ్రేషన్‌ విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు చైనాలో కాస్త తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి దక్షిణ కొరియాలో విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే కొత్తగా 256 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 2,022కు చేరింది. వ్యాధికి కేంద్రంగా ఉన్న దైగు నగరంలోనే 90శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌తో భాగస్వామ్యం మరింత బలపడింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించడంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో ట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌లో ఈ వారం జరిగిన ట్రంప్‌ మొదటి అధికారిక పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్య విలువలను ప్రదర్శించింది’’ అని అన్నారు. ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనల్ని ఒక్కటి చేస్తాయి, ఆలోచనల భాగస్వామ్య  బంధాలు మనల్ని కలుపుతాయి, అధ్యక్షుడి నాయకత్వంలో మన భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని ట్రంప్‌ భారత పర్యటనను ఉద్దేశించి వైట్ హౌస్‌ చేసిన ట్వీట్‌ని ఆయన రీట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆధార్‌ కేంద్రాల్లో అక్రమాల అడ్డుకట్ట దిశగా చర్యలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆధార్‌ నమోదు కేంద్రాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉడాయ్‌ చర్యలు చేపట్టింది. వెయ్యికి పైగా ఉన్న ఈసేవ, మీసేవ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను ప్రభుత్వ ప్రాంగణంలోకి మార్చాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు కోరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం తప్పనిసరి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ‘ది సాయిలర్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌’ లో మోడల్స్‌ సందడి

7. తొలి ఓటమి భారత్‌కు గుణపాఠం: రవిశాస్త్రి

న్యూజిలాండ్‌తో తలపడే రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ పృథ్వీషా ఆడుతున్నట్లు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి స్పష్టంచేశాడు. రెండో టెస్టుకు ముందు పృథ్వీ ఎడమకాలికి గాయమైన సంగతి తెలిసిందే. గురువారం అతడు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనకపోవడంతో రెండో టెస్టులో అతడికి బదులు శుభ్‌మన్‌గిల్‌ను ఆడించే అవకాశముందనే వార్తలు వచ్చాయి. ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమిని చవిచూడటంపై స్పందించిన ఆయన అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు అవసరమని చెప్పాడు. ఈ ఓటమి టీమ్‌ఇండియా ఆటగాళ్లకు గుణపాఠమన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ పాటను రీమిక్స్‌ చేయవద్దు: మలైకా

బాలీవుడ్‌ చిత్రం దిల్‌సే లో హీరో షారుక్‌ఖాన్‌తో కలిసి మలైకా అరోరా ఛైయ.. ఛైయ.. అంటూ రైల్లో వేసిన స్టెప్పులు గుర్తున్నాయా..? అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన పాట అది. అయితే, ఆ పాటను రీమిక్స్‌ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మలైకా అరోరా స్పందించింది. పాట చిత్రీకరించినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఆమె.. అలాంటి మంచి పాటలను రీమిక్స్‌ చేసి వాటి ఒరిజినాలిటీని దెబ్బతీయవద్దంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టర్కీకి భారత్‌ హెచ్చరిక..!

పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్‌ చురకలంటించింది. ఇండియా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. దిల్లీ ఘటనల్ని ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 43వ వార్షికోత్సవం వేదికగా భారత్‌ దీటుగా సమాధానం చెప్పింది. ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకొని వ్యవహరించాలని హితవు పలికింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 73వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.