ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌గా దినేష్‌ కుమార్‌!
close

తాజా వార్తలు

Published : 28/08/2020 22:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌గా దినేష్‌ కుమార్‌!

ముంబయి‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తదుపరి ఛైర్మన్‌గా దినేష్‌ కుమార్ ఖారా పేరును బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో ప్రతిపాదించింది. ప్రస్తుతం రజినీశ్‌ కుమార్‌ ఈ బ్యాంకు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఈ అక్టోబర్‌ ఏడో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌ పదవి కోసం నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేసినట్లు  బ్యాంక్‌ బోర్డు బ్యూరో పేర్కొంది. దినేష్‌ కుమార్‌ పేరును తరువాతి ఛైర్మన్‌గా ప్రతిపాదించింది. చల్లా  శ్రీనివాసులు శెట్టి పేరును రిజర్వ్‌లో ఉంచింది. 1984లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా దినేష్‌ కుమార్‌ విధుల్లో చేరారు. ఎస్‌బీఐలో ఇతర అనుబంధ బ్యాంకుల విలీనంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని