గ్రామ, వార్డు సచివాలయాల ఫలితాలు విడుదల
close

తాజా వార్తలు

Published : 28/10/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామ, వార్డు సచివాలయాల ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను సీఎం జగన్‌ విడుదల చేశారు. 13 శాఖల పరిధిలో మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో పలు దఫాలుగా పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు సెప్టెంబర్‌ 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు 10.56లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 7.68లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థుల మెరిట్‌ జాబితాను గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఓపెన్‌, బీసీ కేటగిరీలో అత్యధికంగా 111 మార్కులు రాగా.. ఎస్సీలో 99.75, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 82.75 మార్కులు వచ్చాయి. 

ప్రస్తుతం 18వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. మెరిట్‌ లిస్ట్‌ నుంచి కేటగిరీ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. 

  ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని