close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/06/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్రాగన్‌ కంట్లో కొడితేనే..

ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టకపోతే భారత్‌ను గౌరవించరు

ముంబయి: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ భారత్‌పై దాడికి దిగుతున్నారని అమెరికా కాలమిస్టు, ప్రముఖ రచయిత గార్డన్‌ జి ఛాంగ్‌ అన్నారు. కరోనా వైరస్‌, ప్రజల్లో పెరుగుతున్న అసహనం, ఎగుమతులు తగ్గిపోవడం, కంపెనీలు ఇతర దేశాలకు తరలివెళ్తుండటంతో ఆయనకు దిక్కుతోచడం లేదన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛాంగ్‌ ఆసక్తికర అంశాలు మాట్లాడారు.


ప్రపంచం దృష్టి మళ్లించేందుకే..

సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెంచి విజయం సాధించామని ప్రజలను భ్రమింపజేసేందుకు జిన్‌పింగ్‌ ప్రయత్నిస్తున్నారని ఛాంగ్‌ అన్నారు. ‘బలహీన పడ్డామన్న భావన చైనా మనసులో ఉంది. ఇప్పటికే కరోనా విషయంలో అభాసుపాలైంది. కొవిడ్‌-19పై ప్రపంచం దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తోంది’ అని ఆయన వివరించారు. తన చుట్టూ ఉన్న అన్ని దేశాలతో చైనాకు కయ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.


జిన్‌పింగ్‌ వరుస వైఫల్యాలు

‘భారతే కాదు దక్షిణ చైనా సముద్రం, అమెరికా, కజక్‌స్థాన్‌, పశ్చిమ ఐరోపాతో చైనాకు‌ తగవులు ఉన్నాయి. ప్రస్తుతం జిన్‌పింగ్‌ వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. అధికారం పోతుందేమోనని భయపడుతున్నారు. నష్టభయం తక్కువున్న వాటిని ఎంచుకొని ఏదైనా సాధించగలిగే సత్తా ఉందని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఛాంగ్‌ వివరించారు.

‘చైనాలో జిన్‌పింగ్‌కు మాత్రమే పూర్తి అధికారాలు ఉన్నాయి. ప్రస్తుత వైఫల్యాల దృష్ట్యా ఇప్పుడాయనకు విజయం కావాలి. భారత్‌ నుంచి కొంత భూమిని లాగేసుకొని డ్రాగన్‌ విజయం ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ మీడియా సైతం కీర్తిస్తుంది కాబట్టి ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. గతంలో పోగొట్టుకున్న ఓ ప్రాంతాన్ని తిరిగి సాధించామని జిన్‌పింగ్‌ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని నా భావన. కానీ అదంత సులభం కాదు’ అని అన్నారు.


అక్కడే భారత్‌ దెబ్బకొట్టాలి

‘భారత్‌ సరిహద్దుల్లో సైనిక బలగాల సంఖ్యను పెంచాలి. కానీ చైనా ఎక్కువగా గాయపడే చోటే (ఆర్థిక వ్యవస్థ) దెబ్బకొట్టాలి. చైనా కంపెనీల ఒప్పందాలు రద్దు చేయాలి. హువావేను అనుమతించొద్దు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి. చైనీయులు ఈ వైఖరిని గమనిస్తేనే భారత్‌ను గౌరవించడం మొదలుపెడతారు. అది జరగనంత కాలం వారు భారత్‌ను గుర్తుపెట్టుకోరు’ అని ఛాంగ్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం చైనా దుందుడుకు వైఖరి ఎవరికీ నచ్చకపోవడంతో ఆ దేశంపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని ఛాంగ్‌ అభిప్రాయపడ్డారు. కంపెనీలు తరలిపోవడం, ఎగుమతులు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బనడంతో  అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే చైనా, జిన్‌పింగ్‌ తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారని వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.