close

తాజా వార్తలు

Updated : 30/07/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌: ఒక్కరోజే 52,000 కేసులు!

ఇప్పటివరకు 10లక్షల కరోనా బాధితులు రికవరీ!
35వేలకు చేరువలో కొవిడ్‌ మరణాలు
జులై నెలలోనే 10లక్షల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగవంతమైంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 52,123 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. 24గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కొవిడ్‌ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా దాదాపు 700మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు. నిన్న మరో 775 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనాసోకి మరణించిన వారిసంఖ్య 34,968 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇంత వరకు 10లక్షల మంది కోలుకున్నారు. మరో 5లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.51శాతం ఉండగా, మరణాల రేటు 2.23శాతంగా ఉంది. 

ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరువలో..
దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 700 కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి చేరువైంది. 35,100 మరణాలతో ఇటలీ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ 34,968 మరణాలతో ప్రస్తుతం ఆరోస్థానంలో ఉంది. కొవిడ్‌ మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌, యూకే, మెక్సికో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని