close
Array ( ) 1

తాజా వార్తలు

అలాంటి క్రికెటర్లను తీసుకోవడమే ధోనీకి ఇష్టం

  సంజయ్‌ మంజ్రేకర్‌

దిల్లీ: ధోనీ నాయకత్వం చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకు అతిపెద్ద బలమని ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌ కార్యక్రమంలో పాల్గొన్న అతడు చెన్నై జట్టుపై స్పందించాడు. ధోనీ.. 2020 ఐపీఎల్‌లో గత సీజన్‌లాగే ప్రదర్శన చేస్తే సీఎస్‌కే జట్టుకు ఎంతో ఉపయోగకరమని చెప్పాడు. 2019 ఐపీఎల్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన మహీ 83.20 సగటుతో 416 పరుగులు చేసి జట్టును రన్నరప్‌గా నిలిపాడు.

‘చెన్నై జట్టు ఎప్పుడూ సీనియర్‌ ఆటగాళ్లని తమ జట్టులో కలిగి ఉంటుంది. ఫా డుప్లెసిస్‌, షేన్‌వాట్సన్‌ టాప్‌ ఆర్డర్‌లో ఉండగా, సురేశ్‌రైనా, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లు మిడిల్‌ ఆర్డర్‌లో ఉంటారు. కాబట్టి మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాక్‌అప్‌ ఆటగాడు కలిగి ఉండటం ఆ జట్టుకు మంచిది. అలాగే ధోనీ వయసుపైబడిన ఆటగాళ్లని తీసుకోవడానికే ఇష్టపడతాడు. అతడి నాయకత్వం కూడా జట్టును మరో స్థాయికి తీసుకెళుతుంది. 2020లో గత సీజన్‌లాగే ప్రదర్శన చేస్తే చెన్నై జట్టుకు ఎంతో ఉపయోగకరం’ అని పేర్కొన్నాడు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.