close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. విద్యాచట్టం సవరణ బిల్లుకు ఆమోదం

  ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. అంతకు ముందు ఇంగ్లిష్‌ మీడియంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోటీ ప్రపంచంలో పేదవారు కూడా నెగ్గాలంటే ఇంగ్లిష్‌ మీడియం అవసరం. పేద విద్యార్థుల కోసమే రైట్‌ టు ఇంగ్లిష్‌ విధానం తీసుకొచ్చాం. విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్‌ను విద్యార్థులకు అందిస్తాం. జూన్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది’’ అని సీఎం జగన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్‌ భాన్‌ కోరారు. దీనిపై స్పందించిన సీజే.. విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదని.. తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నమ్మిన సిద్ధాంతం ఆయనెక్కడా రాజీపడలేదు

శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే ఎంతో విజ్ఞతతో వ్యవహరించేవారని, నమ్ముకున్న సిద్ధాంతం, ఆదర్శాల కోసం ఆయన ఎక్కడా రాజీపడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. గురువారం బాల్‌ఠాక్రే జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు. భాజపాతో కొన్ని దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని వీడి శివసేన గతేడాది నవంబర్‌లో తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్‌ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. అడ్డంకులు ఎదురైనా అమలుచేస్తాం: బొత్స

మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం దారుణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు చెప్పినట్టే మండలి ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కుట్రలు చేసినా తమ ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లును అడ్డుకోవడం విచారకరమన్నారు. మండలిలో తెదేపా ఎమ్మెల్సీల తీరు అభ్యంతరకరమన్నారు. ఈ పరిణామాల వల్ల కొంత జాప్యం జరగొచ్చు కానీ...అమలు చేసి తీరుతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మాపై విషం చిమ్మడం వారికి అలవాటే

భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటుగా మారిందని మండిపడింది. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌ నాయుడు ఆరోపించారు. ‘ఎప్పటి మాదిరిగానే ఒక ప్రతినిధి  బృందం మాపై విద్వేషపూరితమైన ఆరోపణలు చేస్తుంది. ప్రతీసారి ఆ ప్రతినిధి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషాన్ని చిమ్ముతున్నారు’ అని నాయుడు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రూ1.5 కోట్లకు పన్ను కట్టని రష్మిక..!

ప్రముఖ నటి రష్మిక మందన ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ చేసే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ కొన్ని ఆంగ్లపత్రికల్లో కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బీడీఎల్‌లో 15% వాటా విక్రయానికి నిర్ణయం

భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) లో 15 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించనున్నట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్, అత్యాధునిక గైడెడ్‌ ఆయుధ వ్యవస్థలను తయారుచేయగల అతికొద్ది భారతీయ సంస్థలలో ఒకటి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ డైనమిక్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కంగనా చెప్పింది కరెక్ట్‌: నిర్భయ తల్లి

నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి కృతజ్ఞతలు చెప్పారు. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపారు. దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి సమర్థించారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భారత మార్కెట్లోకి ఎంజీ విద్యుత్‌ కారు

హెక్టర్‌ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్‌ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్తు ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు కాగా.. ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 17తో ఈ కార్ల బుకింగ్స్‌ నిలిపివేశారు. అప్పటిలోపు బుక్‌ చేసుకున్న వారికి రూ.లక్ష తగ్గింపు ధరతో విక్రయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రాజస్థాన్: పులులను వెంటాడిన ఎలుగుబంటి

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.