close

తాజా వార్తలు

Published : 25/10/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స

పాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి:మోదీ

సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ.. శత్రువుల బారినుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి, ఈద్‌ వంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతోన్న సైనికులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో సైనికులు, భద్రతా దళాలకు యావత్‌ దేశప్రజలు మద్దతుగా ఉన్నామని గుర్తుచేస్తూ పండుగరోజు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బెంగళూరు vs చెన్నై

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. దుబాయ్‌ వేదికగా చెన్నై, బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. పాత కథలెందుకు నితీశ్‌ జీ..?: తేజస్వి

బిహార్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రచార కార్యక్రమాలు తుది అంకానికి చేరుకోవడంతో అధికార విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెడుతున్నాయి. శనివారం టెహ్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై తాజాగా ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి దీటుగా సమాధానమిచ్చారు.  గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు, కళాశాలలు నిర్మించారో తేజస్వి చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌ చైనాను మించిపోవాలి: మోహన్‌ భగవత్‌

శక్తిసామర్థ్యాల పరంగా చైనాను భారత్‌ మించిపోవాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భవగవత్‌ అన్నారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు విస్తరణ కాంక్షతో ప్రస్తుత చైనాలాగే వ్యవహరిస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రతగా ఉండాలని కోరారు. విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వార్షిక ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన కపిల్‌దేవ్‌

1983 ప్రపంచకప్‌ హీరో, టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్ఛార్జి అయినట్లు మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ వెల్లడించారు. కపిల్‌కు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్‌ అతుల్‌ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్‌ ట్విటర్‌లో పంచుకొని ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కొత్త సినిమాలు.. దసరా కానుకలు

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ మొదలు కావడంతో చిత్ర పరిశ్రమలో నెమ్మదిగా సందడి వాతావరణ నెలకొంది. అగ్ర కథానాయకులు కూడా ఒక్కొక్కరుగా షూటింగ్స్‌కు వస్తుండటంతో సినిమా చిత్రీకరణల జోరు ఊపందుకుంది. దసరా అంటే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌ కళకళలాడేది. అయితే, ఆ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. అయినా, మనవాళ్లు అభిమానులను అలరించేందుకు దసరా శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ

విజయదశమి సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజూము నుంచే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పెద్దమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హైదరాబాద్‌ ఎందుకిలా?

టీ20 క్రికెట్‌లో హైదరాబాద్‌ గతరాత్రి పంజాబ్‌తో తలపడిన సందర్భంగా 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైంది. 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటై సగటు అభిమాని జీర్ణించుకోలేని పరాభవాన్ని ఎదుర్కొంది. అయితే, గతంలోనూ హైదరాబాద్‌ ఇలాగే రెండుసార్లు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయి బోర్లాపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 67,419 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 21 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,587కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 3,585 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.