close

తాజా వార్తలు

Published : 22/10/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. ఆశల పునాదికి సమాధి!

సరిగ్గా ఐదేళ్ల కిందట.. ఒక గొప్ప సంకల్పానికి బీజం పడిన రోజు.. దేశమంతా విజయదశమి వేడుక నిర్వహించుకుంటున్న వేళ.. అయిదు కోట్ల ఆంధ్రుల అస్తిత్వానికి చిహ్నంగా, పట్టుదలకు ప్రతీకగా అమరావతి పేరుతో కొత్త రాజధాని నిర్మాణానికి ప్రధాని చేతులమీదుగా పునాదిరాయి పడింది. ఆనాటి నుంచి ప్రభుత్వం అమరావతి సాకారం కోసం అహోరాత్రాలు శ్రమించింది ఒక్కొక్క వనరూ సమకూర్చుకుంటూ వడివడిగా అడుగులేసింది.. అయిదేళ్లయ్యాక ప్రభుత్వం మారింది.. అమరావతి భవిత అగమ్యగోచరమైంది ప్రజారాజధాని కావాలన్న ప్రజల ఆకాంక్షల పల్లవి మూగబోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నాయిని నర్సింహా రెడ్డి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్‌లోని అపోలో అసుపత్రి వర్గాలు ప్రకటించాయి. సెప్టెంబరు 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామంలో  సుభద్ర, దేవయ్యరెడ్డిల సంతానంగా నర్సింహారెడ్డి జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హెల్మెట్‌ లేకుంటే జరిమానా 1,000

వాహనచోదకులు నిబంధనలు పాటించకపోతే ఇకపై భారీగా జరిమానాలు కట్టడానికి సిద్ధమవ్వాల్సిందే. మోటారు వాహన చట్టంలోని 37 సెక్షన్ల కింద ఉల్లంఘనలకు అపరాధ రుసుములు భారీగా పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019 కింద ఈ జరిమానాలు పెంచుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శిరస్త్రాణం (హెల్మెట్‌) లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే ఇప్పటి వరకు రూ.100 అపరాధ రుసుము విధిస్తుండగా ఇకపై రూ.వెయ్యి కట్టాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆర్టీసీ రాజీ మార్గం!

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్‌ రాష్ట్ర ఆర్టీసీ బస్సులకు ‘మార్గం’ సుగమం అవుతోంది. దసరాకు  నడిచినా నడవకపోయినా సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ మాత్రం దసరాకే బస్సులు నడపాలన్న అభిప్రాయంతో ఉంది. ఒకటి రెండు మార్గాల్లో మినహా మిగిలిన విషయాల్లో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఏకాభిప్రాయం దిశగా అడుగులు పడుతున్నాయి. లాక్‌డౌన్‌ నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నిబంధనలను సడలించినా బస్సులు మాత్రం నడవటం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,27,580కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,292కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,717 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,06,105కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

దసరా సందర్భంగా 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.3,737 కోట్ల బోనస్‌ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విలేకరులకు వెల్లడించారు. రైల్వే, తపాలా, రక్షణ రంగం, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ లాంటి సంస్థల్లో పనిచేసే 16.97 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌ (పీఎల్‌బీ) కింద రూ.2,791 కోట్లు, కేంద్రంలోని ఇతర విభాగాల్లో పనిచేసే 13.70 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు తాత్కాలిక (అడ్‌హక్‌) బోనస్‌ కింద రూ.946 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

పాకిస్థాన్‌లో గద్దెనెక్కిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికార, విపక్షాల మధ్య ఆధిపత్య పోరు మలుపులు తిరుగుతోంది. అది చివరికి అటు సైన్యానికి, ఇటు పోలీసు బలగాలకు మధ్య విభేదాల్ని రాజేస్తోంది. రేంజర్లుగా పిలిచే పారా మిలిటరీ బలగాలు సింధ్‌ ప్రావిన్సులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు సఫ్దర్‌ను అరెస్టు చేసిన వ్యవహారం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. సింధ్‌ పోలీస్‌ చీఫ్‌ ముష్తాఖ్‌ మహర్‌ ఇంటిపైకి రాత్రివేళ రేంజర్స్‌ను పంపి, ఆయన్ని అపహరించి, సంతకం కోసం ఒత్తిడి తీసుకువచ్చి మరీ సఫ్దర్‌ను అరెస్టు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పరీక్షల్లో వైద్య విద్యార్థుల కాపీయింగ్‌

వైద్య విద్యార్థులూ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. వీరిలోనూ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గత నెలలో నిర్వహించిన ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. వీరిలో అయిదుగురు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో, మరో ఇద్దరు హైదరాబాదులో పరీక్షలు రాశారు. ఫైనలియర్‌ పరీక్షల్లోని పీడియాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ పేపర్లలో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. బ్లూటూత్‌తో ఓ విద్యార్థి, సెల్‌ఫోన్లను లోదుస్తుల్లో పెట్టుకొని మరో ఇద్దరు, ప్రింటెడ్‌ మెటీరియల్‌తో నలుగురు విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోనికి రాగా పరిశీలకులు గుర్తించి పట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహారాష్ట్రలో భాజపాకు గట్టి దెబ్బ

మహారాష్ట్రలో భాజపాకు గట్టిదెబ్బతగిలింది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే (68) బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు పార్టీతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరనున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ తెలిపారు. మహారాష్ట్రలో భాజపాను బలోపేతం చేయడంలో దివంగత నేతలు ప్రమోద్‌ మహాజన్‌, గోపీనాథ్‌ ముండేలతో పాటు ఖడ్సే అవిశ్రాంతంగా కృషి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అనగనగా ఓ అద్భుతం

ఐపీఎల్‌ రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఈ సీజన్లో ఆడింది మూడే మ్యాచ్‌లు. అతడిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ప్రత్యర్థి జట్టు కూడా ఎక్కువగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఎవరి దృష్టిలో లేని ఆ బౌలర్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. వరుసగా రెండు మెయిడెన్‌ ఓవర్లు వేశాడు. అంతేనా.. ఆ రెండు ఓవర్లలో మూడు వికెట్లు కూడా పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచేశాడు. స్కోరు 3/3. ఇక ఆ జట్టు కోలుకునేదెక్కడ? ఈ సంచలన ప్రదర్శన చేసింది మన కుర్రాడు మహ్మద్‌ సిరాజే. అతడి ధాటికి   అల్లాడిపోయిన కోల్‌కతా అతి కష్టం మీద 84 పరుగులు చేసింది. ఆర్‌సీబీ ఛేదన లాంఛనమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.