IPL Buzz: గేల్‌ షేడ్స్‌.. కుల్‌దీప్‌ పంచ్‌.. ఆర్‌సీబీ సవాల్‌
close

తాజా వార్తలు

Updated : 18/08/2020 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL Buzz: గేల్‌ షేడ్స్‌.. కుల్‌దీప్‌ పంచ్‌.. ఆర్‌సీబీ సవాల్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో ఐపీఎల్‌-2020 బజ్‌ జోరుగా సాగుతోంది. ఆటగాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఎలా కసరత్తులు చేస్తున్నారు? మొదలైన సంగతులను ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలు అభిమానులతో పంచుకుంటున్నాయి. ప్రత్యర్థులను కవ్విస్తున్నాయి. ఒకప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నాయి. హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది ఇదే రోజు. 2012లో అతడు క్రికెట్‌ నుంచి నిష్క్రమించాడు. వీవీఎస్‌కు సంబంధించి మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ప్రశ్నించింది.

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు శిక్షణ మొదలుపెట్టారు. ఇషాంత్ శర్మ‌, రిషభ్‌ పంత్‌, లలిత్‌ నెట్స్‌లో శ్రమించారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అమిత్‌ మిశ్రా (157) దిగ్గజం కాదంటారా అని డీసీ ప్రశ్నించింది. ఇక కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తమ స్టార్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ ‘333’ షేడ్స్ అంటూ కొన్ని చిత్రాను షేర్‌ చేసింది. డేల్‌ స్టెయిన్‌ చిత్రాన్ని పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో ఇంతకన్నా ఎక్కువ కసివున్న బౌలర్‌ను చూపించండని ఆర్‌సీబీ సవాల్‌ వివసిరింది. మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ ‘పంచ్‌’ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని కేకేఆర్‌ తెలిపింది. పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి తమ ఆటగాళ్లంతా శిబిరానికి చేరారని రాజస్థాన్‌ రాయల్స్‌ ట్వీటింది. ‘హిట్‌మ్యాన్‌’ విమానం ఎప్పుడు ఎక్కుతాడా అని తాము ఎదురుచూస్తున్నామని ముంబయి ఇండియన్స్‌ పేర్కొంది.












Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని